Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్”కు కీరవాణి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Rumours about Keeravani remuneration for RRR

అద్భుతమైన మెలోడీలు కంపోజ్ చేసే లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం కోసం ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం కీరవాణి భారీ పారితోషికం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం రూ.18 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నారనే ప్రచారం మొదలైంది.

Read Also : షారుఖ్ తో కాజోల్… నిజం కాదంటోన్న సీనియర్ బ్యూటీ!

ఈ వార్తలు గనుక నిజమైతే తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందిన సంగీత స్వరకర్తగా కీరవాణి నిలుస్తారు. కొంతమంది ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కీరవాణి గానీ, లేదా “ఆర్ఆర్ఆర్” బృందంగానీ స్పందించాల్సిందే. ఇక డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్యనిర్మిస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీ అక్టోబర్ 13 న విడుదల కానుంది. స్వాతంత్ర్యానికి పూర్వపు కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది.

Exit mobile version