Site icon NTV Telugu

Rukmini Vasanth: సప్త సాగరాలు దాటి టాలీవుడ్’కి వచ్చేస్తోంది.. మొదటి సినిమా ఫిక్స్!

Rukmini Vasanth

Rukmini Vasanth

Rukmini Vasanth to do the female lead role in Ravi Teja Anudeep film: కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ మధ్యకాలంలో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కానీ మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది చూసి భలే లవ్ స్టోరీ రా అనుకున్నారు. ముఖ్యంగా సినిమా మొత్తం మీద తెలుగు వారందరినీ ఆకర్షించే విషయాలలో రుక్మిణి వసంత నటన కూడా ఒకటి.

Prashanth Varma: హాలీవుడ్ వాళ్ళు ఇండియా నుండి ఏ సినిమా వస్తుందని డిస్కషన్ పెట్టే రేంజ్ కి తీసుకువెళ్తా!

అలాంటి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఉంటే బాగుంటుందని కొందరు భావించారు. ఇప్పుడు ఆ భావాన్ని ఏదో నిజం చేస్తూ ఆమె తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆమె ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మాస్ మహారాజ రవితేజ, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఒక సినిమా చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 26వ తేదీన ఉండబోతోంది అని తెలుస్తోంది.

Exit mobile version