Site icon NTV Telugu

Rukmini Vasanth : నా కెరీర్‌లో ప్రత్యేక పాత్ర ఇదే

Rukmini Vasanth

Rukmini Vasanth

తెరపై సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, వరుస అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటున్న కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్. త్వరలో ‘కాంతారా: చాప్టర్‌ 1’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో యువరాణి కనకవతి పాత్రలో మెరిసి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంలో రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

Also Read : Kalaimamani Award: సాయి పల్లవి, ఏసుదాస్ కి కలైమామణి పురస్కారం

“నా కెరీర్‌లో ప్రత్యేకమైన పాత్రలలో యువరాణి కనకవతి ఒకటి. మన జానపద కథలను ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి సినిమాలో అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కనక వతి రాజవంశానికి చెందిన అమ్మాయి అయినా, ఆమెలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఇందులో ఆమె దయ, ధైర్యం చూడడం వల్ల నేనూ లొంగిపోయా. థియేటర్లలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలనుకుంటున్నారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని రుక్మిణి వసంత్ తెలిపారు.

ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్ హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు “రుక్మిణి కనకవతి పాత్రలో చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది”, “కాంతారా కోసం థియేటర్‌లో వెళ్లాల్సిందే” వంటి కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆమె నేచురల్ యాక్టింగ్, ఎమోషన్స్ను పొగడ్తలతో భజిస్తున్నారు. అంతేకాదు, ఫోటోలు, బ్యాక్‌స్టేజ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి, ఇది రుక్మిణి కోసం మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో ఆమె కన్నడ సినిమా కు అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందనుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Exit mobile version