‘పుష్ప’ తర్వాత నేషనల్ క్రష్ ఐడెంటిటీని తీసుకున్న రష్మిక మందన్న.. ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. ఒకవేళ ఒక భాషలో చేస్తే.. ఆ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ‘థామా’ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు రష్మిక బాటలోనే నడుస్తోంది యువ హీరోయిన్ రుక్మిణీ వసంత్. రుక్కు ఖాతాలో ‘కాంతారా: చాప్టర్ 1’ తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా.. క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి.
‘సప్త సాగారాలు దాటి’తో పాపులరైన రుక్మిణీ వసంత్.. ఇప్పటి వరకు కన్నడలో తప్ప మరో భాషలో హిట్ కొట్టలేదు. అయినా సరే మేకర్స్ ఆమెకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కట్టబెడుతున్నారు. కేవలం కన్నడ అనుకుంటే పొరపాటు.. టాలీవుడ్, కోలీవుడ్ కూడా ఆమెకు ఫిదా అయిపోయినట్లే కనిపిస్తోంది. రుక్కు స్క్రీన్ ప్రజెన్స్, ఇన్నోసెంట్ ఫేస్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఆడియన్స్ దిల్ దోచేస్తుండటంతో మేకర్స్ వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.
Also Read: Afghanistan Squad: రషీద్ ఖాన్ కెప్టెన్.. టీ20 వరల్డ్ కప్‌కు అఫ్గానిస్తాన్ జట్టు ఇదే!
రుక్మిణీ వసంత్ ప్రస్తుతం కన్నడలో ‘టాక్సిక్’ ఫిల్మ్‌లో పవర్ ఫుల్ రోల్ చేస్తోంది. తెలుగులో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీలో నటిస్తోంది. తమిళంలో మణిరత్నం సినిమాకు కమిటయ్యిందని సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం.. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఆమె పేరునే పరిశీలిస్తున్నారట. నెక్ట్స్ ఇయర్ సెకండాఫ్ నుంచి మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ సంగతి పక్కన పెడితే.. ఈ లైనప్ చూస్తుంటే పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా రుక్కు మారినట్లుగా కనిపిస్తోంది.
