Site icon NTV Telugu

‘Her – Chapter 1’: ఆరు వారాల తర్వాత కూడా ‘హర్’ టైం నడుస్తోంది!

Her Movie

Her Movie

Ruhani Sharma’s ‘Her – Chapter 1’ Trending On Amazon Prime Even After 8 Weeks: ఒకపుడు తెలుగు ప్రేక్షకులు వేరు ఇప్పుడు వేరు, ఎందుకంటే వారంతా థియేటర్, ఓటీటీ అని సపరేట్ అయ్యారు. కొన్ని సినిమాలు థియేటర్లో బాగా ఆడుతుంటే, ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరి కొన్ని మూవీస్ అక్కడా, ఇక్కడా రెండు చోట్ల సక్సెస్ అవుతున్నాయి. తాజాగా రుహానీ శర్మ నటించిన Her – Chapter 1 (హర్ చాప్టర్ 1) మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉండడం గమనార్హం. గత ఆరువారాలుగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతోందని మేకర్స్ వెల్లడించారు. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించిన హర్ చాప్టర్ 1లో రుహానీ శర్మ మెయిన్ లీడ్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Varalaxmi Sarath Kumar: ఇప్పటివరకూ ఏ సినిమాలో ఇలాంటి సీన్ చేయలేదు!

ఏసీపీ అర్చనా ప్రసాద్‌గా రుహానీ శర్మ తన నటనతో ఆకట్టుకుని ఔరా అనిపించింది. సిటీలో జరిగిన హత్యలకు, తన ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియుడ్ని పోగొట్టుకున్న కేసుకి ఒక లింక్ ఉండటం, వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్చన పాత్రధారి రుహానికి ఎదురయ్యే సవాళ్లన్నీ కూడా ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఇక రెండో పార్ట్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ చాప్టర్ 1 ను కూడా ముగించారు మేకర్స్. ఈ మూవీని గ్రిప్పింగ్‌గా తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీధర్‌కు సైతం మంచి ప్రశంసలు లభించాయి. ఎంతో ఇంటెన్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించిన రుహానీ శర్మ మీద ఆడియెన్స్ ప్రేమను కురిపించగా ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో ఇంకా ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇక ఈ సినిమా సీక్వెల్ మీద కూడా మేకర్స్ ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. హిట్ తరహాలో హర్ సినిమాను కూడా ముందుకు తీసుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version