Ruhani Sharma: చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీశర్మ. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది రుహానీ. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించినంత విజయాలు మాత్రం దక్కలేదు. హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ లాటి సినిమాలు చేసింది కానీ, అమ్మడికి స్టార్ డమ్ దక్కింది లేదు. ఇక ఈ మధ్య వెంకటేష్ నటించిన సైంధవ్ లో గెస్ట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ చిన్నది ఆపరేషన్ వాలెంటైన్ , శ్రీరంగ నీతులు సినిమాలు చేస్తోంది. అమ్మడి సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ అంతాఇంతా కాదు. చూడడానికి పద్దతిగా, స్కిన్ షో లేని పాత్రల్లో కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి అందాల ఆరబోతకు ఏ మాత్రం కొదువలేదు. గ్లామర్ పాత్రలు రాలేదు కానీ, వచ్చి ఉంటే ఈ చిన్నది షేక్ ఆడించేది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఇక అందాల ఆరబోతకు నేను కూడా రెడీ అన్నట్లుగానే రుహనీ హాట్ ఫోటోషూట్లు ఉండడం విశేషం.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అద్దం ముందు అందాల విందు ఆరబోసింది. ఎద అందాలను ఒక డిజైనర్ బ్రాతో కప్పేసి.. మిర్రర్ సెల్ఫీతో పిచ్చెక్కించింది. ఈ ముద్దుగుమ్మ హాట్ ట్రీట్ కు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అమ్మడిలో ఇంత టాలెంట్ ఉందా అని కుర్రకారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇక ఈ ఫోటోల తరువాత రుహనీకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. బంగారు హుండీని చిల్లర కోసం వాడుతున్నారే.. అంటూ డైరెక్టర్లను కూడా తిట్టిపోస్తున్నారు. మరి ఈ చిన్నదాన్ని అందాన్ని, అభినయాన్ని బయటపెట్టే సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.
