Ruhani Sharma as Tanya Sharma in Varun Tej’s Operation Valentine:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఒకేసమయంలో తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా బై లింగ్యువల్ సినిమాగా తెలుగు-హిందీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, వందేమాతరం సాంగ్, గగనాల సాంగ్ ఛార్ట్ బస్టర్స్ అవడంతో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఇక టాలెంటెడ్ యాక్ట్రెస్ రుహాని శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
Upasana Konidela: క్లింకార చెల్లెళ్లను పరిచయం చేసిన ఉపాసన..
తాజాగా మేకర్స్ రుహాని శర్మను తాన్య శర్మగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ యూనిఫాంలో డైనమిక్ గా కనిపించింది రుహాని శర్మ. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం దేశంలో వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఆపరేషన్ వాలెంటైన్’ కు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.