NTV Telugu Site icon

Rudrudu Trailer: లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే

Rudrudu

Rudrudu

Rudrudu Trailer: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. లారెన్స్ అంటే.. టక్కున గుర్తొచ్చేవి దయ్యం సినిమాలే. ఆత్మలు.. తీరని కోరికలు.. ఆ కోరికలను తీర్చే హీరో.. ముని దగ్గర నుంచి మొన్నీమధ్య వచ్చిన గంగ వరకు అన్ని ఇలాంటి సినిమాలే తీసి హిట్లు అందుకున్నాడు. ఇక హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమాలను చేయడం అంటే మాములు విషయం కాదు. చాలా గ్యాప్ తరువాత లారెన్స్ నుంచి వస్తున్న చిత్రం రుద్రుడు. కతిరేసన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇదొక యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది.

Samantha: సామ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ బ్రాండ్

కుటుంబంతో ఎంతో హ్యాపీగా ఉండే యువకుడు రుద్రన్. కానీ, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం రుద్రుడుగా మారిపోతాడు. ఈ నేపథ్యంలోనే ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడి ఆనందంగా జీవితం సాగిస్తున్న రుద్రన్ జీవితంలోకి విలన్ భూమి ఎంట్రీ ఇస్తాడు. డబ్బు అనే పిచ్చితో చేయరాని పనులు చేసే భూమికి, రుద్రన్ కు మధ్య ఒక విషయంలో గొడవ మొదలవుతుంది. అతడి మీద ఉన్న కోపంతో భూమి, రుద్రన్ భార్యా పిల్లలను చంపించి, అతడిని జైలుకు పంపిస్తాడు. ఇక జైలు నుంచి తిరిగి వచ్చిన రుద్రన్, భూమి మీద ఎలా పగ తీర్చుకున్నాడు..? అసలు భూమికి ఏం కావాలి..? ఎందుకు రుద్రన్ తో పెట్టుకున్నాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. భూమిగా శరత్ కుమార్ కనిపించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే లారెన్స్ అదరగొట్టేశాడు. ఇక జీవీ ప్రకాష్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారగా.. లారెన్స్ అంటే హర్రర్ సినిమాలోతోనే వస్తాడు అనుకున్న అభిమానులు లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.