Site icon NTV Telugu

RRR : రంగంలోకి ఆర్టీసీ… సెలెబ్రిటీల కోసమే !?

RRR

RRR మేనియా నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. స్క్రీన్‌పై రాజమౌళి సృష్టించిన కొత్త ప్రపంచానికి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఇప్పుడు RRR కోసం ఆర్టీసీని రంగంలోకి దింపుతున్నాడట నిర్మాత. RRR కోసం పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటుల కోసం నిర్మాత డివివి దానయ్య ఈరోజు కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్‌ లలో స్పెషల్ షోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీళ్లంతా కలిసి రాజమౌళితో బెనిఫిట్ షోను చూస్తారా ? లేదా నెక్స్ట్ షోను చూస్తారా? అనేది తెలియదు.

Read Also : RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్

అయితే సెలెబ్రిటీలంతా థియేటర్ కు చేరుకునే క్రమంలో అవాంఛిత ట్రాఫిక్ జామ్‌ లు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మొత్తం టీమ్ థియేటర్‌కు చేరుకోవడానికి వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం మానుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు “ఆర్‌ఆర్‌ఆర్‌” బృందం తెలంగాణ ఆర్టీసీతో మాట్లాడి ప్రయాణానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. RRR బృందాలు దానయ్య కార్యాలయంతో పాటు మరికొన్ని ప్రదేశాలలో బస్సు ఎక్కి థియేటర్ కు చేరుకుంటారు. తరువాత అదే బస్సులో బయలుదేరుతారని అంటున్నారు. ఈ వార్తలు గనుక నిజమైతే అటు ఆర్టీసీకి, ఇటు ‘ఆర్ఆర్ఆర్’కు ప్రమోషన్స్ జరిగినట్టే !

Exit mobile version