NTV Telugu Site icon

RRR : పే-పర్-వ్యూపై వెనక్కి తగ్గిన జీ5

Rrr

Rrr

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ స్ర్టీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసి 20వ తేదీనుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రేజీ సినిమా కోసం పే ఫర్ వ్యూ పద్దతిని అనుసరించాలని ముందు అనుకుంది జీ5. అయితే ఇప్పుడా ఆలోచన విరమించుకుని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తన సబ్ స్క్రైబర్స్ కి ఉచితంగానే చూపించబోతోంది. దీనికి కారణం మరో ఓటీటీ లో మరో సూపర్ హిట్ సినిమా ‘కెజిఎఫ్‌2’ వైఫల్యమే. ఈ సినిమాను కూడా 20 తేదీ నుంచి పే ఫర్ వ్యూ పద్ధతిలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మోడల్ ఘోరంగా దెబ్బతింది. ఎలాంటి క్రేజ్ రాకపోగా వినియోగదారులు ఆ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి వ్యతిరేకంగా గొంతెత్తారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా అలాగే పే ఫర్ వ్యూకి సరైన స్పందన లేకపోడంతో పాటు పైరసీ కూడా పెరిగే అవకాశం ఉందని భావించి తమ వినియోగదారులకు ప్రీగానే చూపించబోతోంది జీ5. మే 20 నుండి ‘ఆర్ఆర్ఆర్’ను జీ5 వినియోగదారులు దక్షిణాది భాషల్లో ఉచితంగా చూడవచ్చన్నమాట. ఇక నెట్‌ఫ్లిక్స్ ‘ఆర్ఆర్ఆర్’ హిందీ, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్ వెర్షన్‌లను అందుబాటులోకి తీసుకు రానుంది. సో ఈ రియల్ మల్టీస్టారర్ ను మరోసారి జీ5లో చూసి ఆనందించండి.