“ఆర్ఆర్ఆర్” దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనేలేదు. ఒక్క దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాక్ తో పని లేకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడమే పనిగా “ఆర్ఆర్ఆర్” దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు.
Read Also : KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?
రామ్ చరణ్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ RRRని ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా వివిధ దేశాలలో విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా అక్టోబర్‌లో జపాన్‌లో విడుదలవుతుందని, ప్రమోషన్స్‌లో భాగంగా చెర్రీ, ఎన్టీఆర్‌తో సహా యూనిట్ రెండు రోజుల పాటు ఆ దేశాన్ని సందర్శిస్తామని రామ్ చరణ్ తెలిపారు. RRR చైనాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చరణ్ చెప్పుకొచ్చాడు. RRR గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాకు అక్కడ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే మన దేశంలో మాత్రం ఇంకా “ఆర్ఆర్ఆర్” క్రేజ్ ఏమాత్రం చల్లారలేదనే చెప్పాలి.
