NTV Telugu Site icon

RRR: చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ టీంకి ‘చిరు’ సన్మానం…

Rrr

Rrr

ఇండియన్ సినిమా ప్రైడ్ ని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఇండియాకి ఆస్కార్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటు ఆస్కార్ అవార్డుని ఇండియాకి తెచ్చింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన రాజమౌళి అండ్ టీంని మెగాస్టార్ చిరంజీవి సన్మానించాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా నిన్న రాత్రి స్పెషల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, వల్లి గారు, కార్తికేయ, డీవీవీ దానయ్య, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లని చిరు సన్మానించాడు. లిరిసిస్ట్ చంద్రబోస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మాత్రమే మిస్ అయిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తెలుగు వాడు సాదించిన ఈ విజయం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది అని చిరు ట్వీట్ చేశాడు. ఈ సన్మాన కార్యక్రమంలో అడివి శేష్, నాగ చైతన్య, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నాగార్జున, వెంకటేష్, అఖిల్, అమలతో పాటు దిల్ రాజు, అల్లు అరవింద్, అశ్వినీ దత్, బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూసర్ తదితర నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

Read Also: Naga Chaitanya: డిన్నర్ కి వెళ్లిన చై-శోభిత… సోషల్ మీడియాలో ఫోటో వైరల్

Show comments