Site icon NTV Telugu

RRR: చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ లకి జేజేలు కొట్టిన వెస్ట్ ఆడియన్స్…

Rrr Charan Ntr

Rrr Charan Ntr

2023లో మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అంటే ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. కరోనాతో వీక్ అయిన సినిమా మార్కెట్ ని ఊపిరి పోస్తూ దర్శక ధీరుడు తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లాంటి యాక్టింగ్ పవర్ హౌజ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్ సౌండ్ బౌండరీలు దాటి వినిపించడం మొదలయ్యింది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా, వెస్ట్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకి రానంత రీచ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి వచ్చింది. ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో ఉన్న మన ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈవెంట్స్ లో జెండా ఎగరేస్తోంది.

తాజాగా వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ అయిన “ది క్రియేటివ్ లైఫ్, TCL చైనీస్ థియేటర్స్” లో స్క్రీనింగ్ జరిగింది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణిల సమక్షంలో జరిగిన ఈ స్క్రీనింగ్ లో మన ఇండియన్ సినిమాకి వెస్ట్ ఆడియన్స్ జేజేలు కొట్టారు. ఒక భారతీయ సినిమాకి వెస్ట్రన్ ఆడియన్స్ లో ముందెన్నడూ రాని గుర్తింపుని ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్క్రీన్ పైన ఆర్ ఆర్ ఆర్ సినిమాని చూస్తూ లాస్ ఏంజిల్స్ ఆడియన్స్ పూనకలు వచ్చినట్లు ఊగిపోయారు. నాటు నాటు సాంగ్ కి స్క్రీన్ ముందుకి వెళ్లి డాన్స్ వేశారు. చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తే అరుపులు కేకలు పెట్టారు, ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్ కి ఎమోషనల్ అయ్యారు. ఎమోషన్స్ ఇండియాన్స్ మాత్రమే కాదు మనుషులు అందరికీ ఒకేలా ఉంటాయని వెస్ట్ ఆడియన్స్ నిరూపించారు.  స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడి మీడియా అండ్ ఆడియన్స్ తో ‘ఆర్ ఆర్ ఆర్ టీం’ Q&A’ సెషన్ లో పాల్గొన్నారు. చరణ్, ఎన్టీఆర్ లు వెస్ట్రన్ మీడియాకి స్పెషల్ ఇంటర్వూస్ ఇస్తున్నారు.

Exit mobile version