NTV Telugu Site icon

RRR: ఆ అవార్డ్ మిస్ అయిన ఆర్ ఆర్ ఆర్…

Best Non English

Best Non English

‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో మన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుందనే విషయం తెలియగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో గోల్డెన్ వర్డ్స్ తో ఇన్స్క్రైబ్ చెయ్యాల్సినంత గొప్పది. ఈ అవార్డ్స్ లోనే “బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో” కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా నామినేట్ అయ్యింది. అయితే ఈ అవార్డ్ ని ఆర్ ఆర్ ఆర్ సినిమా జస్ట్ మిస్ అయ్యింది. బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని ‘అర్జెంటినా 1985’ అనే స్పానిష్ ఫిల్మ్ గెలుచుకుంది. 1985లో జరిగిన ‘ట్రైల్ ఆఫ్ జుంటాస్’ అనే ఒరిజినల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకోని తెరకెక్కిన ‘అర్జెంటినా 1985’ ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని మెప్పిస్తోంది. 2022లో వరల్డ్ ఫిల్మోగ్రఫిలోని టాప్ 5 ఇంటర్నేషనల్ మూవీస్ లిస్టులో ‘అర్జెంటినా 1985’కి కూడా చోటు ఇచ్చింది ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ’. ఇప్పటివరకూ బెస్ట్ మోషన్ పిక్చర్ కేటగిరిలో పది అవార్డ్స్ ఈవెంట్ లో ఇతర సినిమాలతో పోటీ పడిన ‘అర్జెంటినా 1985’ అందులో 7 సార్లు బెస్ట్ పిక్చర్ అవార్డుని గెలుచుకుంది. 95వ ఆస్కార్ అకాడెమీ అవార్డ్స్ లో కూడా ‘అర్జెంటినా 1985’ బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ కేటగిరిలో పోటి చేస్తుంది. దాదాపు ఈ మూవీనే ఆస్కార్ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.