Site icon NTV Telugu

ప్రతి పది నిమిషాలకు బొమ్మ దద్దరిల్లిపోతుందట

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇట్టే వైరల్ అయిపోతుందంటే అర్ధం చేసుకోవచ్చు ఈ చిత్రంపై అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారనేది..! ఇక రాజమౌళి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెండు రేట్లు ఎక్కువే ఉంటుందని ఆయన గత సినిమాలు చూసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకిగానూ అదే హామీ ఇస్తున్నారు చిత్రంలో పనిచేసిన కొందరు.

ఈ సినిమా మొదలైన 10 నిమిషాలకొక్కసారి బొమ్మ దద్దరిల్లిపోతుందని చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమా పోరాట సన్నివేశాలు ఇండియన్ సినిమాలోనే ది బిగ్గెస్ట్ సీన్స్ గా మిగిలిపోతాయట. ప్రతి ఫైటింగ్ స్కీన్ దేనికి అదే ప్రత్యేకంగా నిలిచిపోతాయని ఫుల్ కాన్ఫిడెంట్ ఇస్తున్నారు. ఈ కథకి ఖచ్చితంగా ప్రేక్షకులు ఎమోషన్ అవుతారు. మరోసారి తెలుగువాడి సత్తా ప్రపంచానికి తెలియబోతుందంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఫైనల్ షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం ఇటీవల ఉక్రెయిన్‌ వెళ్ళింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్‌ నటిస్తుండగా.. రాంచరణ్ జోడిగా అలియా భట్ నటిస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

https://youtu.be/VPT_EIo89cc
Exit mobile version