RRR: రజినీకాంత్ రికార్డుకు ఎండ్ కార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేయడానికి చరణ్ ఎన్టీఆర్ లు సిద్ధమయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి, ఇటివలే జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చేశాడు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేయడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. గత వారంలో బాహుబలి సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసి, జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ రెండో స్థానంలో నిలిచింది. జపాన్ ఆడియన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి వస్తుండడంతో, ఆర్ ఆర్ ఆర్ సినిమా ‘ముత్తు’ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందరూ అనుకున్నట్లే సరిగ్గా వారం తిరిగే సరికి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ముప్పై సంవత్సరాల నుంచి చెక్కు చెదరని రజినీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి రెడీ అయ్యింది.
జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటి వరకు 362M (22 కోట్లు) రాబట్టింది. కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో రూపొందిన ‘ముత్తు’ సినిమా 1995లో రిలీజ్ అయ్యింది. రజనీకాంత్ కి జపాన్ లో ఫ్యాన్ బేస్ ని తెచ్చిన ‘ముత్తు’ సినిమా అప్పట్లోనే 400M(32 కోట్లు) కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. గత మూడు దశాబ్దాల్లో ఎన్నో సినిమాలు ‘ముత్తు’ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేశాయి కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆ ఫీట్ ని టచ్ చేసి, కొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్ ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఓవరాల్ రన్ లో 500M రాబట్టే అవకాశం ఉంది. ఇది జపాన్ లో విడుదలకాబోయే ఇండియన్ సినిమాలకి ఒక కొత్త బెంచ్ మార్క్ అవనుంది.
Also Read
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..