Site icon NTV Telugu

RRR Movie: 100 రోజులు పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. పోస్టర్ రిలీజ్

Rrr Movie Min

Rrr Movie Min

స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్లలో రికార్డులు బద్దలుకొట్టిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఒకవైపు బైక్‌పై ఎన్టీఆర్ కనిపిస్తుండగా.. మరోవైపు గుర్రంపై రామ్‌చరణ్ సవారీ చేస్తున్నాడు. ఈ పోస్టర్ అటు నందమూరి, ఇటు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read Also: Naresh Pavithra Lokesh: పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయిన రమ్య

అలాగే ‘RRR’ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(HCA) ఇచ్చే మిడ్ సీజన్ అవార్డ్స్‌లో ఈ సినిమా రన్నరప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని హెచ్‌సీఏనే సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఎంపికైంది. దీంతో ఆర్.ఆర్.ఆర్ సినిమా అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్నట్లు అయ్యింది. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

Exit mobile version