దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్ని సినిమాలు వచ్చినా, ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా చెక్కు చెదరకుండా ఉన్న రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేశారు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి, ఇటివలే జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చేశాడు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేయడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. గత వారంలో బాహుబలి సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసి, జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ రెండో స్థానంలో నిలిచింది. జపాన్ ఆడియన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి వస్తుండడంతో, ఆర్ ఆర్ ఆర్ సినిమా ‘ముత్తు’ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందరూ అనుకున్నట్లే సరిగ్గా వారం తిరిగే సరికి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ముప్పై సంవత్సరాల నుంచి చెక్కు చెదరని రజినీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.
కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో రూపొందిన ‘ముత్తు’ సినిమా 1995లో రిలీజ్ అయ్యింది. రజనీకాంత్ కి జపాన్ లో ఫ్యాన్ బేస్ ని తెచ్చిన ‘ముత్తు’ సినిమా అప్పట్లోనే 400M(32 కోట్లు) కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. గత మూడు దశాబ్దాల్లో ఎన్నో సినిమాలు ‘ముత్తు’ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేశాయి కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆ ఫీట్ ని టచ్ చేసి, కొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటి వరకు 410Mలని రాబట్టింది. ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్ ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఓవరాల్ రన్ లో 500M రాబట్టే అవకాశం ఉంది. ఇది జపాన్ లో విడుదలకాబోయే ఇండియన్ సినిమాలకి ఒక కొత్త బెంచ్ మార్క్ అవనుంది.