Site icon NTV Telugu

RRR: హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో నాలుగు అవార్డులు గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్

Rrr

Rrr

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టి పోస్ట్ కోవిడ్ ఎరాలో ఇండియన్ సినిమా ప్రైడ్ ని నిలబెట్టింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరోలు నటించిన ఈ యాక్షన్ ఎపిక్ ఇండియాలోనే కాదు వరల్డ్ మ్యాప్ లో ఇండియన్ సినిమాకి హ్యుజ్ రెస్పెక్ట్ తెచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ బరిలో ఉంది. మార్చ్ 12న ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ ఫ్లాగ్ ని ఎగారేస్తుందనే హోప్ అందరిలోనూ ఉంది. మార్చ్ 12కి ఇంకా టైం ఉంది కానీ అప్పటివరకూ ఈ జోష్ ని ఎంజాయ్ చెయ్యండి అంటూ హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ని గెలిచి ఇండియాకి గిఫ్ట్ గా ఇచ్చాడు జక్కన్న. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ ఇచ్చే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అవార్డ్స్ ని, మరో స్పెషల్ అవార్డుని గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది.

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా టాప్ క్లాస్ హాలీవుడ్ సినిమాలని కూడా వెనక్కి నెట్టి అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. పై నాలుగు కేటగిరిల్లో మాత్రమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్ కాస్ట్’కి స్పాట్ లైట్ అవార్డ్ కూడా దక్కింది. భారి బడ్జట్, హ్యుజ్ స్టార్ కాస్ట్ ఉన్న ఇంటర్నేషనల్ సినిమాలని కూడా వెనక్కి ఆర్ ఆర్ ఆర్ సినిమా హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడం గొప్ప విషయం. తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ ఈ అవార్డ్స్ ఈవెంట్ కి వెళ్లలేదు కానీ రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణిలు మాత్రం ఈ అవార్డ్స్ ఈవెంట్ ని అటెండ్ అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ పెద్దగా డ్రీమ్ చెయ్యడానికి, ఇంటర్నేషనల్ రేంజ్ సినిమాలని చెయ్యడానికి ఆర్ ఆర్ ఆర్ సాదిస్తున్న విజయాలు బిగ్గెస్ట్ బూస్ట్ అనే చెప్పాలి.

Exit mobile version