Aswani Dutt: రోషన్ ను ‘ఛాంపియన్’ చేస్తానంటున్న సీనియర్ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roshan: ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ తమ ప్రొడక్షన్ నంబర్ 9 గా యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. సోమవారం రోషన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ సినిమాలో అతని లుక్‌ను రివీల్ చేయడంతో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఛాంపియన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. రోషన్ పోస్టర్‌లో పొడవాటి జుట్టు, లైట్ గడ్డంతో చాలా అందంగా కనిపిస్తున్నాడు. టైటిల్ లోగోపై రెండు వైపులా రెక్కలతో ఫుట్‌బాల్ ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమాతో అందరినీ మెప్పించిన రోహన్ ‘ఛాంపియన్’లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం రోషన్ మేకోవర్ అయ్యాడని పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్ కాగా, మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్‌లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..