NTV Telugu Site icon

Bubble Gum Trailer: కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. డీజే రోషన్ కనకాల లెక్క వేరేగా ఉందే!

Bubble Gum Trailer

Bubble Gum Trailer

Roshan kanakala Bubble Gum Trailer Seems intresting: యంగ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సుమ -రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా మారి చేసిన ‘బబుల్‌గమ్’ ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టీజర్, పాటలకు మంచి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో డిసెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ క్రమంలో ఈ రోజు బబుల్‌గమ్ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ ట్రైలర్ లాంచ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ట్రైలర్ పరిశీలిస్తే “నా నసీబ్ లో ఎం రాసి పెట్టుందో నాకు తెల్వదు… కానీ నచ్చినట్లు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అదీ ఇజ్జత్ అయినా… ఔకాత్ అయినా’’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

No More Secrets: ‘నో మోర్ సీక్రెట్స్’ అంటూ లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన జ్యోతి రాయ్!

ట్రైలర్ లో ‘బబుల్‌గమ్‌’ కథాంశాన్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశారు మేకర్స్. మ్యూజిక్ వరల్డ్ లో తనదైన ముద్ర వేసుకోవాలని డీజే రోషన్ కనకాల ప్రయత్నిస్తుంటాడు, అయితే మానస చౌదరిని కలిసిన తర్వాత అతని జీవితం మరో మలుపు తిరుగుతుంది. కొన్ని అనూహ్య కారణాల వలన ప్రేమ విఫలం కావడంతో తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్న రోషన్ అందుకు కష్టపడతాడు. ఇక ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉన్నాయి. ట్రైలర్ లో రోషన్ కనకాల బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, డైలాగ్ డిక్షన్, పెర్ఫార్మెన్స్ ఆసక్తికరంగా ఉండగా మానస చౌదరి చాలా అందంగా కనిపించింది. సురేష్ రగుతు కెమెరా పనితనం, శ్రీచరణ్ పాకాల తన అద్భుతమైన సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేసేలా చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Show comments