పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది ‘రొమాంటిక్’. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో ఆకాశ్ కి జోడీగా కేతికా శర్మ నటించింది. ఈ సినిమాకు పూరి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించగా అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను నిర్మించారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు అలరిస్తుండటం విశేషం.
Read Also : ఇంట్రెస్టింగ్ వీడియోతో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్
