Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలేస్తోందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సరసన అమ్మడే బెస్ట్ ఛాయిస్ గా మారింది. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో కృతి సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరనుంచి ప్రభాస్ తో ఆమె రిలేషన్ లో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఆపుకార్లకు వరుణ్ ధావన్ ఆజ్యం పోశాడు. కృతి లవ్ లో ఉందని, అతను ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ లో ఉన్నాడని స్టేజిమీదనే చెప్పుకు రావడంతో ప్రభాస్ అభిమానులు వారిద్దరికీ నెట్టింట పెళ్లి కూడా చేసేశారు. ఆ తరువాత తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పుకోవడానికి ప్రభాస్- కృతి చాలా కష్టపడ్డారు. ఇకపోతే ప్రస్తుతం కృతి వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా షాహిద్ కపూర్ సరసన కృతి ఒక కొత్త సినిమా ఓకే చేసింది.
Renu Desai: మీరు ఒక తల్లికి పుట్టలేదా.. అకీరా నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్
జియో స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సముద్రపు ఒడ్డున బైక్ పై కృతి, కృతి థైస్ పై షాహిద్ కూర్చొని ముద్దు పెట్టడానికి రెడీ అయ్యాడు. పోస్టర్ ను బట్టే ఈ సినిమా మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. అయితే కేవలం వీరి పేర్లు, బ్యానర్ మాత్రమే రివీల్ చేశారు. అంతేకాకుండా అసలు సాధ్యంకాని ప్రేమకథ అంటూ ఒక ట్యాగ్ లైన్ కూడా రాసుకొచ్చారు. దీంతో పోస్టర్ పై ఆసక్తి రేగింది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు.. టైటిల్ ఏంటి అని తెలుసుకోవడానికి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ పోస్టర్ కథాకమామీషు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
