Roja: రోజా కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతోనే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roja: టాలీవుడ్ లో నటిగా ఎంతో పేరు తెచ్చుకొని ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటుతోంది ఆర్ కె రోజా. ఎంపీగా పదవిస్వీకారం చేసాకా జబర్దస్త్ కు కూడా మానేసిన ఆమె పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు తెలిపింది. ఇక రోజా-సెల్వమణికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న విషయం విదితమే. ఆమె కూతురు పేరు అన్షు మాలిక. తాజాగా అన్షును హీరోయిన్ గా రోజా పరిచయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అన్షు.. అమెరికాలోని ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సాధించింది. అందులో జాయిన్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరో కొడుకు సినిమాతో అన్షు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నదట.
అతను ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్.. ఇటీవలే తండ్రితో కలిసి మహాన్ సినిమాలో నటించి మెప్పించిన ధృవ్.. టాలీవుడ్ లో ఒక సాలిడ్ స్క్రిప్ట్ తో ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడట. విక్రమ్ కు తెలుగు అభిమానులు ఎంత ప్రేమను పంచుతున్నారో ధృవ్ కు కూడా అదే విధంగా ప్రేమను పంచుతారని విక్రమ్ ఆశిస్తున్నాడు. అందుకే మంచి కథ కోసం విక్రమ్ కూడా వెతుకుతున్నాడట. ఇక ఈ చిత్రంలో ధృవ్ సరసన అన్షుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫ్రెష్ ఫేస్, అమాయకమైన చూపుతో తల్లినే మరిపిస్తుంది అన్షు. దీంతో హీరోయిన్ గా ఆమె రాణిస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో యెంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!