HHVM : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెన్ ఫిట్ షోలు ఆగిపోయాయి. టికెట్ రేట్లు పెంచడం కూడా ఆపేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపకాలు ఉండవని తేల్చి చెప్పేశారు. పుష్ప-2 తర్వాత సినిమాలకు ఇవేవీ లేకుండానే రిలీజ్ చేసుకున్నారు. కానీ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల హైక్ వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. ‘మేం మొదట అడిగినప్పుడు మాకు టికెట్ రేట్ల హైక్స్, ప్రీమియర్ షో ఇవ్వడం కుదరదని తేల్చేశారు. కానీ రోహిన్ రెడ్డి వల్ల ఇది సాధ్యం అయింది. ఆయన మాకు ఈ ప్రీమియర్ షోలు, హైక్ ఇప్పించారు’ అని తెలిపారు.
Read Also : HHVM : ప్లాపుల్లో నా కోసం నిలబడింది త్రివిక్రమ్ మాత్రమే : పవన్
దీంతో ఎవరీ రోహిన్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఈ రోహిన్ రెడ్డి కాంగ్రెస్ లో కీలక నేత. సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి వ్యక్తిగా పేరుంది. 2023లో అంబర్ పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో సాయి ధరమ్ తేజ్‌తో ‘తిక్క’ అనే సినిమాకు నిర్మాతగా చేశారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈయనకు చాలా పరిచయాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పలుమార్లు కలిశారు. మెగా ఫ్యామిలీతో రోహిన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో పాటు పవన్ కల్యాణ్ కు ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ రీత్యా ఈ ప్రీమియర్ షోలతో పాటు టికెట్ రేట్ల హైక్ సాధ్యం అయింది. వీరమల్లు మూవీ జులై 24న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
