Site icon NTV Telugu

Robo Shankar: హన్సిక.. నన్ను తాకడానికి నిరాకరించింది.. దర్శకుడు బతిమిలాడినా

Hansika

Hansika

Robo Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు లేని స్టార్ హీరో సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రోబో శంకర్ ప్రస్తుతం పార్ట్నర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రోబో శంకర్, మరో కమెడియన్ యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హన్సిక తీరుపై రోబో శంకర్ ఘాటు విమర్శలు చేశాడు. షూటింగ్ లో ఆమె ప్రవర్తించిన తీరును మీడియా ముందు ఎండకట్టాడు.

Jailer First Single: ఊ అంటావా మావ కన్నా ఊగిపోయేలా ఉందే

“షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం హన్సిక నా కాలును తాకాలి. కానీ, ఆమె నన్ను తాకడానికి నిరాకరించింది. దర్శకుడు ఎంత బతిమిలాడినా ఆమె ఆ పని చేయలేదు. సడెన్ గా హన్సికను చూసి సెట్ లో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఇక చేసేదేం లేక డైరెక్టర్ ఆ సీన్ లేకుండానే షూట్ కంప్లీట్ చేశాడు.” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోబో శంకర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆయన వ్యాఖ్యలపై మహిళా జర్నలిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. స్టేజిపై ఒక హీరోయిన్ గురించి ఇలా మర్యాద లేకుండా మాట్లాడడం పద్దతి కాదని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై రోబో శంకర్ భార్య స్పందించింది. తన భర్త ఆరోగ్యం బాగోలేదని, మానసిక స్థితి బాగోకపోవడం వలన ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది. మరి ఈ వ్యాఖ్యలపై హన్సిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version