Site icon NTV Telugu

రోడ్ ట్రిప్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ మూవీ!

Road Trip Thrillar Launched by Maruthi

అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ పతాకపంపై జి. రాధిక తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ మారుతి అతిథిగా హాజరై, ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు. జి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి స్టోరీ చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు.

Read Also : వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న ఈ మూవీ సింగిల్ షెడ్యూల్ లో పూర్తి కానుంది. రోడ్ ట్రిప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని దర్శకుడు రామరాజు జి. తెలిపారు. కొన్ని రియాలిస్టిక్ సంఘటనల ఆధారం గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మురళీధర్ సింగు, సంగీతం మహవీర్ యెలందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీరబాబు .కె.

Exit mobile version