NTV Telugu Site icon

RK Selvamani: చేతనైతే వీడియోలు బయట పెట్టండి.. ఆరోపణలపై స్పందించిన మంత్రి రోజా భర్త

Rk Selvamani Rk Roja

Rk Selvamani Rk Roja

RK Selvamani Responds about Allegatoions on Roja: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అసభ్యకరంగా మంత్రి రోజాను ఆయన సంబోధించడమే కాదు అనేక రకాల ఆరోపణలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో పలు కేసులు నమోదైన క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం మీద తాజాగా మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి స్పందించారు. ఇలాంటి రకమైన ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదని, సుమారు పదేళ్ల క్రితమే మంత్రి రోజా గురించి అసభ్యకరమైన ఆరోపణలు చేశారని అన్నారు. రోజా ఒక స్ట్రాంగ్ వాయిస్ గా మారిన నేపథ్యంలో ఆయన మానసికంగా దెబ్బతీసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Balakrishna: బాలయ్య ముఖం మీదే గాజులు పగలగొట్టించుకుని, ఉమ్మి వేయమన్నారు.. నటుడు సంచలన వ్యాఖ్యలు!

ఈ విధంగా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం అనేది తెలుగుదేశం నేతలకు అలవాటైపోయిన విషయమేనని అయినా ఇలాంటి బెదిరింపులు కరెక్ట్ కాదని ఆయన అన్నారు. వారు చెబుతున్నట్లుగా ఆరోపిస్తున్నట్లుగా ఏమైనా ఆధారాలు ఉంటే ఏమైనా వీడియోలు ఉంటే బయట పెట్టాలని వాటిని మేము లీగల్ గానే ఎదుర్కొంటామని ఆయన చెప్పుకొచ్చారు. సత్యనారాయణమూర్తి ఇలాంటి ఆరోపణలు చేసిన మొదటి వ్యక్తి కాదని గతంలో ఒక మహిళా మంత్రి చనిపోయిన మరో మంత్రి కూడా ఇదే విధమైన ఆరోపణలు చేసేవారు అని అన్నారు. రోజాను ఎదుర్కోవడం కష్టం అని భావించే ఇలా మానసికంగా దెబ్బతీసి ఆమెను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలా తయారవుతున్నారని ఆయన అన్నారు. వారు ఆరోపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు ఉన్నా తమకు ఇవ్వాలని సెలవమని చెప్పుకొచ్చారు.

Show comments