Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం బరిలోకి మరో హీరో.. ఏకంగా పిఠాపురంలో?

Rk Naidu Campaigns For Pawan Kalyan

Rk Naidu Campaigns For Pawan Kalyan

RK Naidu Sagar Campaigns For Pawan Kalyan In Pithapuram : పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో ఆయనకు మద్దతుగా బరిలోకి దిగారు. ఆయన ఇంకెవరో కాదు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్‌. బుల్లితెరపై ఆర్కే సాగర్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొగలి రేకులు సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ హీరోగా మారిపోయిన ఆయన ఇప్పుడు అక్కడ కనిపించకున్నా సినిమాలతోనూ తన అభిమానుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ది 100’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇక ఒక పక్క తన సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కోసం రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు

ఇక ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తరుపున ఇప్పటికే సెలెబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు, ఈ క్రమంలో సాగర్ సైతం తన వంతుగా ప్రచారాన్ని చేపట్టారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు సాగర్ చేసిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ‘గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి’ అని సాగర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. రీసెంట్‌గానే మెగా మదర్ అంజనమ్మ చేతులు మీదుగా రిలీజ్ చేయించిన ది 100 టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్కే నాయుడు ఇప్పటికే తెలంగాణ జనసేన లో జాయిన్ అయ్యారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన చాలా యాక్టివ్గా జనసేన కోసం పనిచేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఆయన ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం.

Exit mobile version