Site icon NTV Telugu

RK Roja: మహేష్ బాబు తో సినిమా.. అలాంటి పాత్ర అయితేనే చేస్తా

Roja

Roja

RK Roja: మినిస్టర్ ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటివరకు జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ గా పదవి చేపట్టిన తరువాత మొత్తాన్ని వదిలేసింది. ఓ లెక్కన చెప్పాలంటే.. ముఖానికి మేకప్ వేసుకోవడం మానేసింది. ఇక నిత్యం రాజకీయాల్లో ఆమె యమా యాక్టివ్ గా ఉంటూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక జబర్దస్త్ నటులను మాత్రం ఆమె ఏ రోజు మరిచిపోయింది లేదు. తనను నమ్మి వచ్చినవారికి.. సహాయం అని వచ్చినవారికి ఆమె తనవంతు సాయం చేస్తూ ఉంటుంది. ఇక మొన్నటికి మొన్న పంచ్ ప్రసాద్ కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు ఆమె ఎంతో సాయం చేసిన విషయం తెల్సిందే. ఇక తాజాగా నేడు.. సీరియల్ నటి శ్రీవాణి కొత్త ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయగా.. ఆ రెస్టారెంట్ ఓపెనింగ్ కు రోజా ముఖ్య అతిధిగా వెళ్లి.. వారికి శుభాకాంక్షలు తెలిపింది.

Mannara Chopra:స్టేజిపై డైరెక్టర్ ముద్దు.. అందులో తప్పేముంది.. వాళ్లకు పనిలేక

ఇక ఈ వేడుకలో అక్కడకు వచ్చిన అభిమానులతో రోజా ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే తనకు ఇష్టమైన వంటలతో పాటు.. తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని చెప్పగా.. మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు చేస్తారు అని ఫ్యాన్స్ అడిగారు. అందుకు రోజా మాట్లాడుతూ.. ” మహేష్ బాబు తో నటించాలని చాలా కోరిక.. అయితే.. అమ్మ, అత్త లాంటి పాత్రలు చేయను.. కేవలం అక్క, వదిన అయితే చేస్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రోజా కోరికను నెరవేర్చే డైరెక్టర్ ఎవరో చూడాలి.

Exit mobile version