Ritu Varma : సినిమా హిట్ అయితే అందరికీ పేరొస్తుంది. కానీ ప్లాప్ అయితే మాత్రం కొందరికే నిందలు వస్తాయి అంటోంది రీతూవర్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి సినిమాలే చేస్తోంది. అలాగే తమిళ్ లో కూడా మెరుస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై స్పందిస్తూ ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో అనేక విషయాలపై స్పందించింది. మరీ ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ బిజినెస్ వియాలపై మొదటిసారి స్పందిస్తూ మాట్లాడింది.
Read Also : Mohanbabu : కన్నప్పపై మోహన్ బాబు స్పెషల్ వీడియో
‘సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అది పెద్ద హిట్ కావాలని అందరం కోరుకుంటాం. నేను కెరీర్ మొదట్లో సినిమా ప్లాప్ అయితే కలెక్షన్ల విషయంలో బాధపడేదాన్ని. కానీ ఆ తర్వాత చేసిన సినిమాల గురించి కాకుండా చేయబోయే సినిమాల గురించి ఆలోచిస్తున్నా. కొన్ని సార్లు సినిమాలు ప్లాప్ అయితే హీరో, హీరోయిన్లపై నిందలు వేస్తారు. సినిమా ఆడియెన్స్ కు నచ్చకపోతే మేమేం చేస్తాం. డైరెక్టర్ చెప్పింది చేయడమే మా పని. మిగతా విషయాలు మా చేతిలో ఉండవు కదా. ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది’ అంటూ తెలిపింది ఈ బ్యూటీ.
Read Also : Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్
