నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” రేపు విడుదల కావాల్సి ఉంది. ఓటిటి విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన అనంతరం మేకర్స్ ఈ సినిమాను వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే సినిమా “టక్ జగదీష్” అనుకున్న సమయం కంటే ముందుగానే అందుబాటులోకి రానున్నాడు. ఈ రోజు రాత్రి 10 గంటల తరువాత అమెజాన్ ప్రైమ్ లో “టక్ జగదీష్” ప్రీమియర్ కానుంది.
Read Also : సోను సూద్ కు బిగ్ డే… మరో ప్రాణం నిలబడింది
ప్రస్తుతం టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ సమయంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ “టక్ జగదీష్” గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇందులో ఆమె నానితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది. ఆమె పాత్ర, టక్ జగదీష్ హైలెట్స్ వంటి విషయాలను వెల్లడించింది. “ఇప్పటి వరకు నేను సిటీ బేస్డ్ అమ్మాయిగా నటించాను. కానీ ఈ సినిమా కోసం నేను ఒక చిన్న సిటీలో నివసించే మహిళ గుమ్మడి వరలక్ష్మి అనే పాత్రలో నటిస్తున్నాను. వరలక్ష్మి ప్రభుత్వ ఉద్యోగి. ఆమె చాలా కూల్ గా ఉంటుంది. నేను ఎప్పుడూ అలాంటి పాత్రను పోషించలేదు. నాని నటించిన చిత్రంలో అలాంటి పాత్రను చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. టక్ జగదీష్ సినిమా చాలా ఎమోషన్స్‌తో నిండి ఉంది” అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ “నేను ఈ పాత్రలో నటించడానికి ఏ గ్రామాన్ని సందర్శించలేదు. కానీ దర్శకుడి ఆదేశాల మేరకు నేను ఆ పాత్రలోకి మారిపోయాను” అని అన్నారు.
నానితో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ “నేను నానితో కలిసి ఇప్పటికే “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలో పని చేశాను. కానీ ఆ సమయంలో నేను అతనితో పెద్దగా మాట్లాడలేదు. కానీ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “టక్ జగదీష్” సినిమాకు అతనితో చాలా సమయం గడపాల్సి వచ్చింది. జీవితంలో వివిధ సమస్యల గురించి నాని మాట్లాడే విధానం, ఆయన సినిమాలను ఎంచుకునే విధానం నాకు చాలా ఇష్టం” అంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.