బిగ్ డే… మరో ప్రాణం నిలిపిన సోనూ సాయం

బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేస్తున్న మంచి పనులు చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలుసు. కరోనా కష్ట సమయంలో చాలా మందికి తగిన సాయం చేసి తోడుగా నిలిచిన సోనూ సూద్ కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి చలించిపోయారు. చేతిలో తగినంత డబ్బు లేక, పట్టించుకునే నాథుడు లేక అల్లాడిపోతున్న ప్రజలకు తన దాతృత్వ గుణంతో దేవుడయ్యాడు. ఇప్పటికి ఆయన తన సేవను అలాగే కొనసాగిస్తున్నారు.

Read Also : రవితేజ ఈడీ విచారణ ప్రారంభం… అతనే కీలకం !

సోనూ సూద్ తాజాగా మరో ప్రాణాన్ని నిలబెట్టారు. “బిగ్ డే… ఇటీవలి కాలంలో మాకు అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స ఒకటి సూపర్ సక్సెస్. సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేయించుకున్న బాలుడి కుటుంబ సభ్యులు కూడా సోనూసూద్ కు ధనువాదాలు తెలిపారు. “ధన్యవాదాలు సోనూసూద్. మీ మద్దతుతో శుభమ్ కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు శుభమ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మీ సహాయానికి ధన్యవాదాలు!” అంటూ ట్వీట్ చేశారు. దీంతో సోనూ సాయం వల్ల మరో ప్రాణం నిలబడింది.

ఎప్పటి కప్పుడు దేశంలో నెలకొంటున్న పరిస్థితులను గమనిస్తున్న సోనూ ఉత్తరప్రదేశ్ లో తాజాగా నెలకొన్న పరిస్థితులపై కూడా స్పందిస్తూ ఎవరికైనా సాయం కావాలంటే సోషల్ మీడియా ద్వారా తెలపాలని, తనకు చేతనైన సాయం చేస్తానని ట్వీట్ చేశారు. “యూపీలో చాలా మంది పిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు. అటువంటి బాధితురాలి కుటుంబం మీకు తెలిస్తే వారి అభ్యర్థనను #UmeedBySonuSood ట్యాగ్ ఉపయోగించి మాకు సందేశం పంపండి. ఈ క్లిష్ట సమయంలో సాధ్యమైనంత సహాయాన్ని వారికి అందించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము” అంటూ సోనూ హామీ ఇచ్చారు.

Related Articles

Latest Articles

-Advertisement-