Site icon NTV Telugu

Ritika Naik : ఆమె నా స్ఫూర్తి.. మంచి యాక్షన్ కథల్లో నటించాలని ఉంది

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న నటి రితికా నాయక్, తాజాగా ఫాంటసీ యాక్షన్ డ్రామా మిరాయ్ లో కీలక పాత్ర పోషించారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Also Read : Kantara-Chapter-1 : గ్లోబల్ రీచ్ కోసం సిద్ధమవుతున్న ‘కాంతార 1’.. వర్కౌట్ అవుతుందా?

‘‘సూపర్ హీరో సినిమాలు నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మిరాయ్ నేను కూడా సూపర్ పవర్స్ ఉన్న యువతిగా కనిపిస్తాను. రెండున్నరేళ్ల పాటు కష్టపడి చేసిన ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైన మలుపు అవుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, కార్తీక్ ఘట్టమనేని వినిపించిన ఈ కథలోని ఫాంటసీ, ప్రేమ, యాక్షన్ అంశాలు నాకు బాగా నచ్చాయి. అందుకే వెంటనే అంగీకరించాను.‘ఇందులో నేను విభ అనే బలమైన సన్యాసిని పాత్రలో కనిపిస్తాను. హిమాలయాల్లో ఉండే ఈ పాత్ర ప్రయాణం ఏమిటన్నది తెరపైనే ఆసక్తికరంగా తెలుస్తుంది. నా నిజ జీవితానికి పూర్తిగా భిన్నమైన ఈ రోల్ చేయడం నాకు పెద్ద సవాల్. సాధారణంగా నేను చాలా మాట్లాడుతుంటాను కానీ విభ మాత్రం ప్రశాంతమైన శక్తివంతమైన పాత్ర. ఈ సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు నిజమైన మంచు పర్వతాలు, అడవుల్లో చిత్రీకరించాం. ఆ కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేయడం ఓ సాహసంలా అనిపించింది’’ అని వివరించారు.

తన భవిష్యత్తు గురించి రితికా మాట్లాడుతూ.. ‘‘ఫాంటసీ కథలు చేయడం నాకిష్టమే కానీ యాక్షన్, రొమాంటిక్ కథల్లోనూ నటించాలని ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు చేయాలని కోరిక ఉంది. నేను అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి. ఆమె కళ్లతోనే భావాలను వ్యక్తపరచే తీరు చూసి ఎంతో ముచ్చట పడ్డాను. ఫిదా సినిమా చూసిన తర్వాత ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తున్నా. అదనంగా డ్యూయెట్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉన్నాయి.’ అని తెలిపింది. ప్రజంట్ సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version