Ritika Naik : ఆమె నా స్ఫూర్తి.. మంచి యాక్షన్ కథల్లో నటించాలని ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న నటి రితికా నాయక్, తాజాగా ఫాంటసీ యాక్షన్ డ్రామా మిరాయ్ లో కీలక పాత్ర పోషించారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read : Kantara-Chapter-1 : గ్లోబల్ రీచ్ కోసం సిద్ధమవుతున్న ‘కాంతార 1’.. వర్కౌట్ అవుతుందా?
Also Read
‘‘సూపర్ హీరో సినిమాలు నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మిరాయ్ నేను కూడా సూపర్ పవర్స్ ఉన్న యువతిగా కనిపిస్తాను. రెండున్నరేళ్ల పాటు కష్టపడి చేసిన ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకమైన మలుపు అవుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, కార్తీక్ ఘట్టమనేని వినిపించిన ఈ కథలోని ఫాంటసీ, ప్రేమ, యాక్షన్ అంశాలు నాకు బాగా నచ్చాయి. అందుకే వెంటనే అంగీకరించాను.‘ఇందులో నేను విభ అనే బలమైన సన్యాసిని పాత్రలో కనిపిస్తాను. హిమాలయాల్లో ఉండే ఈ పాత్ర ప్రయాణం ఏమిటన్నది తెరపైనే ఆసక్తికరంగా తెలుస్తుంది. నా నిజ జీవితానికి పూర్తిగా భిన్నమైన ఈ రోల్ చేయడం నాకు పెద్ద సవాల్. సాధారణంగా నేను చాలా మాట్లాడుతుంటాను కానీ విభ మాత్రం ప్రశాంతమైన శక్తివంతమైన పాత్ర. ఈ సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు నిజమైన మంచు పర్వతాలు, అడవుల్లో చిత్రీకరించాం. ఆ కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేయడం ఓ సాహసంలా అనిపించింది’’ అని వివరించారు.
తన భవిష్యత్తు గురించి రితికా మాట్లాడుతూ.. ‘‘ఫాంటసీ కథలు చేయడం నాకిష్టమే కానీ యాక్షన్, రొమాంటిక్ కథల్లోనూ నటించాలని ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు చేయాలని కోరిక ఉంది. నేను అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి. ఆమె కళ్లతోనే భావాలను వ్యక్తపరచే తీరు చూసి ఎంతో ముచ్చట పడ్డాను. ఫిదా సినిమా చూసిన తర్వాత ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తున్నా. అదనంగా డ్యూయెట్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉన్నాయి.’ అని తెలిపింది. ప్రజంట్ సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!