NTV Telugu Site icon

Rithu Chowdhary: రీతూ మార్ఫింగ్ వీడియోలు.. నాతో వస్తావా.. రేట్ ఎంత అని అడుగుతున్నారట..

Rithu

Rithu

Rithu Chowdhary: సీరియల్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టి జబర్దస్త్ లో ఎంటర్ అయ్యి ఫేమస్ అయిన నటి రీతూ చౌదరి. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్యనే రీతూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోలపై రీతూ మొదటిసారి స్పందించింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె మాట్లాడుతూ.. తన ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారని, ఆ వీడియోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపింది. ఆ వీడియోలను నాకే ట్యాగ్‌ చేసి పైశాచిక ఆనందం పొందారని, సోషల్ మీడియాలో తానేం పెట్టినా చాలా దారుణంగా కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగి దాదాపు ఐదు నెలలు అయినా కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పాలా? వద్దా? అని తనలో తానే చాలాసార్లు బాధపడ్డానని, బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయానని చెప్తూనే.. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించానని కానీ చేయక తప్పడం లేదని చెప్పుకొచ్చింది.

ఇక తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ గురించి కూడా ఆమె మాట్లాడింది. తాను, శ్రీకాంత్ బయటికి వెళ్ళినప్పుడు ఈ వీడియోల గురించి చెప్పినట్లు.. అతను తనకు సపోర్ట్ గా నిలిచినట్లు తెలిపింది. ఇక తన మార్ఫింగ్ వీడియోలను చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన రీతూ.. పోలీసులు వారిని పట్టుకున్నట్లు తెలిపింది. వారిపైనే కాకుండా సోషల్ మీడియాలో తనను నాతో వస్తావా.. రేట్ ఎంత అని అడిగినవారిపైన కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments