Site icon NTV Telugu

Bigg Boss : రీతూ చౌదరికి భారీ షాక్ ఇవ్వనున్న నాగార్జున..?

Rithu Chowdary

Rithu Chowdary

Bigg Boss : రీతూ చౌదరి ఇప్పుడు తీవ్ర వివాదంలో పడింది. తన భర్త హీరో ధర్మతో రీతూ ఎఫైర్ పెట్టుకుందని గౌతమి చౌదరి సంచలన వీడియో లీక్ చేసింది. తన భర్త ధర్మతో గౌతమి రెండేళ్ల క్రితమే రీతూ గురించి చేసిన వాట్సాప్ చాట్ ను కూడా బయట పెట్టింది. ఈ మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ధర్మతో ఆమె అర్ధరాత్రి తిరుగుతున్న వీడియోలు కనిపిస్తున్నాయి. దీంతో రీతూ మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. రీతూ ఇలాంటి పని చేస్తుందా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ సీజన్-9లో ఉన్న సంగతి తెలిసిందే. కరెక్ట్ టైమ్ చూసి గౌతమి ఇవన్నీ బయట పెట్టింది.

Read Also : OG : జానీ సినిమా చూసి సుజీత్ అలా చేశాడు.. పవన్ కామెంట్స్

ఇప్పటికే రీతూ భర్త శ్రీకాంత్ నుంచి దూరంగా ఉంటుంది. అప్పట్లో అక్రమాస్తుల కేసులో, ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ కేసుల్లో విచారణ ఎదుర్కుంది. ఇలా వరుస వివాదాలకు తోడు.. ఇప్పుడు ఏకంగా ఎఫైర్ బయట పడటంతో ఆమెపై నెగెటివిటీ బాగా పెరిగింది. ఆమెను హౌస్ లో కొనసాగిస్తే ఉంచుకుంటే బిగ్ బాస్ బ్రాండ్ పడిపోతుందని మేనేజ్ మెంట్ భావిస్తోంది. అందుకే ఈ వారం బయటకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయంట. ఓటింగ్ తో సంబంధం లేకుండా ఆమెను ఈ వారం చివర్లో ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగ ఆ హౌస్ లోనూ రీతూ పవన్ కల్యాణ్‌, డిమాన్ పవన్ లతో ట్రాక్ నడిపిస్తోంది. ఇద్దరినీ వలలో పడేసి ఆటాడిస్తోంది. కాబట్టి ఇదే మంచి టైమ్ అని బిగ్ బాస్ మేనేజ్ మెంట్ భావిస్తోందంట.

Read Also : Tamannaah : ఒక్క సాంగ్ కోసం తమన్నా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?

Exit mobile version