Kantara:గత కొన్నిరోజులుగా చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా కాంతార పేరే వినిపిస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం నటించిన ఈ చిత్రం అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకొంటుంది. కెజిఎఫ్ ను మైమరిపించే కథ, రికార్డులను కొల్లగొడుతూ తన సత్తా చూపిస్తోంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. ఇక సినిమా మొత్తానికి ఆయువు పట్టు అంటే చివర్లో వచ్చే ‘వారహ రూపం.. దైవ వరిష్టం..’ అని చెప్పొచ్చు. ఇటీవలే ఈ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ పాట తమది అని, కాంతార సినిమా వాళ్లు తమ సాంగ్ ను కాపీ చేశారని మలయాళంకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు సంచలన ఆరోపణలు చేసింది. కాపీ అంటే కనీసం అక్కడ అక్కడ కూడా లేకుండా ప్రతి పదాన్ని కాపీ చేసి రిలీజ్ చేశారని చెప్పుకొస్తున్నారు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా తమవద్ద ఉన్నాయని వారు తెలుపుతున్నారు. అయితే ఈ వివాదం వలన వారు కోరుకొనేది ఏంటి..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం గురించి ఇప్పటివరకు మేకర్స్ నోరు విప్పింది లేదు.
సినిమా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటివరకు నవరస పట్టించుకోకుండా ఇప్పుడెందుకు ఇంత వివాదాన్ని సృష్టించాలని చూస్తోంది. సరే ఈ కాపీ ఆరోపణలను మేకర్స్ ఎందుకు లైట్ తీసుకొంటున్నారు అనేది కూడా పాయింటే. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ వివాదం వలన ఎవరికైన ఉపయోగం ఉందా అంటే అది కూడా కాంతారకే చెందుతోంది. ఈ సాంగ్ కాపీ అని చెప్పడం వలన సినిమా చూడనివారు కూడా సాంగ్ చూసి కాపీనా కాదా అని చెక్ చేస్తున్నారు. దీనివలన సినిమా కలక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇక మరోపక్క ఆరోపణలు చేసిన వారి ఆల్బమ్ ను కూడా వారి సాంగ్ కు కూడా వ్యూస్ వస్తున్నాయి, దీంతో ఇద్దరికీ ఉపయోగమే ఉందని అంటున్నారు. ఇక ఈ వివాదాన్ని పెంచుకొంటూ పోతే సినిమాపై నెగెటివ్ మర్క్స్ పడే అవకాశం ఉంటుందని త్వరగా మేకర్స్ దీనికి సమాధానం చెప్తే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదంపై రిషబ్ శెట్టి ఎలా స్పందిస్తాడో చూడాలి.