Site icon NTV Telugu

Kantara Chapter 1: సెట్‌లోనే 4 సార్లు చనిపోయేవాడిని.. ప్రాణాపాయం మధ్య కాంతారా పూర్తి చేశా : రిషబ్ శెట్టీ

Kanthara Chanper1

Kanthara Chanper1

పాన్-ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’. రిషబ్ శెట్టీ దర్శకత్వంలో ఇప్పటికే హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.  ప్రభాస్ చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ లాంచ్ చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్  తెలిపారు. ఇక  ట్రైలర్ మొత్తం రిషబ్ శెట్టి లుక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకటుకుంది. ముఖ్యంగా, రిషబ్ శెట్టి తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో రిషబ్ శెట్టీ మాట్లాడుతూ..

Also Read : Om Raut : ఆదిపురుష్ ఫ్లాప్‌‌తో కాన్ఫిడెన్స్ కోల్పోయాను..

“సినిమా షూటింగ్ సమయంలో నాకు సెట్స్‌లో 4–5 సార్లు చనిపోయేవాడిని. అనేక ప్రమాదాలు జరిగాయి. కొందరు సినిమా యూనిట్‌లో సభ్యులు అనుకోకుండా మరణించడం కూడా జరిగింది. ఈ పరిస్థితులు చుట్టూ వారిని నిరాశలో నెట్టాయి” అని తెలిపారు. అయిన కూడా చిత్ర యూనిట్ సవాళ్లను ఎదుర్కొని, సినిమాను సమయానికి పూర్తి చేయడానికి కృషి చేసింది. “మేము మూడు నెలలుగా సరిగ్గా నిద్ర పోలేదు. దర్శక బృందం, నిర్మాతలతో సహా ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం తమ సొంతంగా కృషి చేశారు. సెట్‌లో ఎదురైన ప్రమాదాల మధ్య, విశ్వాసం, దైవత్వం మాకు రక్షణగా నిలిచింది” అని రిషబ్ పేర్కొన్నారు.

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంభూతకోళ ప్రాథమికత, ఎమోషనల్ ఎంటర్‌టైన్‌మెంట్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కలిగి ప్రేక్షకులను థియేటర్‌లో కట్టిపడేసేలా రూపొందించబడింది. స్క్రీన్‌ప్లేను రిషబ్ శెట్టీ, అనిరుధ్ మహేష్, షానిల్ గురు కలసి రాశారు. రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవియ మరియు ఇతరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version