NTV Telugu Site icon

Rishab: నేను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలి పోను… శెట్టి కౌంటర్ ప్రశాంత్ నీల్ కేనా?

Rishab Shetty

Rishab Shetty

కాంతర సినిమాతో ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడియన్స్ లో మరింత రెస్పెక్ట్ పెంచిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతర ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. కాంతర పార్ట్ 1గా తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ అండ్ మోషన్ పోస్టర్ బయటకి వచ్చింది. వరాహ అవతారం వెనక కథని కాంతర 1లో చూపించబోతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. “ఒక్క హిట్ కొట్టగానే… అందరిలాగా నేను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలి వెళ్లాను” అంటూ రిషబ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. కన్నడ సినీ అభిమానులు కొంతమంది రిషబ్, రష్మిక గురించే మాట్లాడాడు అంటుంటే మరికొందరేమో ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడాడు అంటున్నారు. ఈ ఇద్దరి గురించి రిషబ్ మాట్లాడాడో లేక కేవలం తన ఒపీనియన్ మాత్రమే చెప్పాడో తెలియదు కానీ రిషబ్ మాటలు మాత్రం రష్మిక అండ్ ప్రశాంత్ నీల్ ఇద్దరికీ సెట్ అవుతాయి. అందుకే ఆడియన్స్ రిషబ్ మాటలని వాళ్లకి రిలేట్ చేసుకుంటున్నారు.

రష్మిక అనే కాదు హీరోయిన్స్ ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తూ ఉంటారు. అది సర్వసాధారం అయితే డైరెక్టర్స్ మాత్రం మోస్ట్లీ తమ సొంత ఇండస్ట్రీకే స్టిక్ ఆన్ అవుతారు. రాజమౌళి, లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్, సంజయ్ లీలా భన్సాలీ… లాంటి దర్శకులు ఎన్ని సినిమాలు చేసినా ఎంత పెద్ద హిట్స్ ఇచ్చినా తమ సొంతం ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలి వెళ్లరు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఈ కారణంగానే రిషబ్ కామెంట్స్ చేసి ఉండొచ్చు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలకి సరిపడే బడ్జట్ లు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత ప్రొడ్యూసర్స్ లు ఇస్తారు అనేది ఆలోచించాల్సిన విషయం.