మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ, లీషా ఎక్లైర్ జంటగా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్, మధు నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘రైట్’. మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం పోస్టర్, మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘రైట్’ విజయం సాధించాలని వెంకటేష్ అభిలషించారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఈ చిత్రం చేశానని, కరోనా వల్ల చాలా ఆలస్యం అయినా వెంకటేశ్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని కౌశల్ అంటున్నాడు.
Right Movie: వెంకటేష్ చేతుల మీదుగా కౌశల్ మండ ‘రైట్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్

right