Site icon NTV Telugu

ప్రస్తుత మెగాస్టార్ అల్లు అర్జునే అంటున్న వర్మ

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ లేకపోవడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీనిని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఈ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. అల్లు అరవింద్ తనయులు అర్జున్, శిరీష్, బాబీ ఎక్కడా కనిపించలేదు. ఈ వీడియో విడుదలైన తర్వాత శిరీష్ ట్విట్టర్ ప్రొఫైల్‌ లో చిరు బర్త్ డే వేడుకల ఫోటోను పోస్ట్ చేసాడు. అయితే అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్ గైర్హాజరు వెనక ఉన్న కారణాలను విశ్లేషిస్తున్నారు.

Read Also: ‘ఆర్.ఎక్స్. 100’ హిందీ రీమేక్ ఎప్పుడంటే…

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ అంటే ఒంటి కాలిమీద లేచే రామ్ గోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. చిరు బర్త్ డే వేడుకలకు హాజరు కాకపోవడంలోనే అల్లుఅర్జున్ తెలివితేటలు కనిపిస్తున్నాయని అంటూ బన్నీ సల్ఫ్ మేడ్ గా ఎదిగిన తార అని వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లా ఫ్యామిలీ పరాన్నజీవులు కాదని ట్వీట్ చేశాడు. ఈ రోజు మరో ట్వీట్ చేస్తూ ఒరిజినల్ మెగా స్టార్ చిరంజీవి తర్వాత ప్రస్తుతం ఉన్న ఒకే ఒక మెగా స్టార్ అల్లు అర్జున్ అని అన్నాడు. వర్మ ట్వీట్స్ పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Exit mobile version