వివాదాస్పద దర్శకుడు తాజాగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై తనదైన శైలిలో స్పందించి సంచలనం సృష్టించారు. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయమై నెలకొన్న అనిశ్చితిపై ఆర్జీవీ స్పందించిన తీరు వార్తల్లో నిలిచింది. ఆంధ్రా పెద్దలతో సినీ పెద్దలు కలవడానికి, సమస్యలను విన్నవించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఆర్జీవీ ఎంట్రీతో వివాదం మరింత ముదిరింది. సిఎంమా టికెట్ రేట్ల విషయంలో మీ జోక్యం ఏంటి ? అంటూ లైవ్ లో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవీ, ఆ తరువాత కూడా వదలకుండా సోషల్ మీడియాలోనూ పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. మంత్రి పేర్ని నాని కూడా ఏమాత్రం తగ్గలేదు. పది ప్రశ్నలకు తోడుగా మరో పది ప్రశ్నలను వేస్తూ బదులిచ్చారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి మాట్లాడుకుందాం అంటూ సోషల్ మీడియా వార్ కు చెక్ పెట్టారు. ఇక ఈ విషయంలో వర్మ సైలెంట్ అనుకుంటున్న తరుణంలోనే మరో బాంబు పేల్చాడు.
Read Also : ఇండస్ట్రీలో కరోనా కలకలం… హీరోయిన్ కు పాజిటివ్
తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన సెన్సేషనల్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. “వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్ జగన్… చుట్టూ ఉన్న వైసీపీ లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్ ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్… నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్ తో జాగ్రత్తగా ఉండు” అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లో ఏపీ సీఎంను హెచ్చరించారు వర్మ.
