ఇండస్ట్రీలో కరోనా కలకలం… హీరోయిన్ కు పాజిటివ్

ఇండస్ట్రీలో కరోనా మరోమారు కలకలం సృష్టిస్తోంది. సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించి, తమను కలిసిన వారు టెస్ట్ చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు కోవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. కరోనా చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే బాలకృష్ణ నెక్స్ట్ మూవీలో వరలక్ష్మి నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా కోసమే ఆమె హైదరాబాద్ వచ్చింది. అయితే ఆమె చిత్రబృందంలో ఎవరెవరిని కలిశారు ? వారి పరిస్థితి ఏంటి అనే విషయం మాత్రం తెలియరాలేదు.

Read Also : నాటి అందాల అభినేత్రి బి.సరోజాదేవి

కాగా వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి, కోలీవుడ్ నటి రాధిక తన భర్త, నటుడు శరత్‌ కుమార్‌కు డిసెంబర్ లో కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతుండడం ఆందోళనకరంగా మారింది.

Related Articles

Latest Articles