Site icon NTV Telugu

RGV : చిరంజీవి, చరణ్ లపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..

ram gopal varma

ram gopal varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఎవరో ఒకరిపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఇక ఆర్జీవీ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారడం ఖాయం.. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ అయ్యేది కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని.. మిగతా ఎవ్వరికీ ఆ అర్హత లేదని చెప్పి సంచలనం సృష్టించిన వర్మ.. మరోసారి మెగా ఫ్యామిలీపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.ఆచార్య చిత్రం నుంచి 4వ పాటను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడానికి చిరు, చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ వీడియోలో తండ్రీకొడుకులు డాన్స్ గురించి మాట్లాడుతూ.. తగ్గను, తగ్గేదేలే అని సరదాగా సంభాషించుకున్నారు.

ఇక ఈ వీడియో పై వర్మ కామెంట్ చేశాడు. ” నేను మెగా హర్ట్ అయ్యాను.. చిరంజీవి, చరణ్ తగ్గను. తగ్గేదేలే అని అల్లు అర్జున్ డైలాగ్స్ వాడుతుంటే.. చిరంజీవి, చరణ్.. బన్నీ న్యూ మెగా హీరో అని ఋజువుచేసినట్లు ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మరోసారి అల్లు ఫ్యామిలీ- మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది. కొంతమంది వర్మకు సపోర్ట్ చేస్తుంటే… ఇంకొంతమంది వర్మను ఏకిపారేస్తున్నారు. సినిమాలు తీయటం చేతకాని వాడు ఇలాంటి ట్వీట్లతో లైంలైట్ లో వుండాలని ట్రై చేస్తాడు అని కొందరు.. నీకు పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నావు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version