RGV: నాగబాబు యాక్షన్.. వర్మ రియాక్షన్.. నాకన్నా పెద్ద కమెడియన్ నువ్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV:వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రస్తుతం ఎలాంటి వివాదాలను ఎదుర్కుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా వర్మను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మ పోలీసుల దగ్గరకు కూడా వెళ్ళాడు. వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనసేన నేత నాగబాబు.. వర్మపై నిన్న సెటైర్ వేసిన విషయం తెల్సిందే. “RGV గారి పై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను..RGV గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో..ఆ మాటకొస్తే ఇండియా లో ఏ పనికిమాలిన ఎధవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి…ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.
ఇక తాజాగా నాగబాబు యాక్షన్ కు వర్మ రియాక్షన్ ఇచ్చాడు. ఈ ఫేస్ బుక్ పోస్ట్ ను షేర్ చేస్తూ “సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే, నా సినిమాలో మీరు.. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి” అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఒక నెటిజన్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేశాడు. అందులో ఎందుకురా
నాగబాబూ RGV ని కెలుకుతావ్? నీ అన్న వేసే ముష్టితో,తమ్ముడు ఇచ్చే పాకెట్ మనీతో, కొడుకు,కోడలు విసిరే కుక్క బిస్కెట్లతో శేష జీవితం ప్రశాంతంగా గడపొచ్చుగా అని రాసి ఉంది. దానికి వర్మ.. నాగబాబు యొక్క గట్టి శ్రేయోభిలాషిగా నేను ఈ ట్వీట్ ను ఖండిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి 😎😎😎 pic.twitter.com/RbhusBDNvf
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
As a staunch well wisher of @NagaBabuOffl I strongly condemn this tweet https://t.co/Q4bRRXGPMb
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
- Tags
- Nagababu
- RGV
- Tollywood News
- vyuham
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!