Site icon NTV Telugu

RGV: లెస్బియన్ మూవీ విడుదల వాయిదా..!

Maa Estam

Maa Estam

అనుకున్నంతా అయ్యింది! ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న తేదీకి జనం ముందుకు రాలేదు. వర్మ ‘డేంజరస్’ మూవీ విషయంలోనూ అదే జరిగింది. అయితే మరీ దారుణంగా రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఇలా జరగడం మాత్రం చిత్రంగానే ఉంది. పైగా గత పది రోజులుగా రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సరా రాణీ ని వెంటబెట్టుకుని దేశమంతా విమానంలో చక్కర్లు వేసొచ్చారు. ఇవాళ వర్మ పుట్టిన రోజు. అదే రోజున ఆయనకు వరుసగా రెండు షాకులు తగిలాయి. ఒకటి నిర్మాత నట్టికుమార్ తనయుడు క్రాంతి ‘డేంజరస్’ (తెలుగులో ‘మా ఇష్టం) చిత్రం విడుదలపై కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చాడు. అయితే వాళ్ళుకు ఇవ్వాల్సిన మొత్తం వర్మ ఇచ్చేసి, సినిమాను విడుదల చేస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అలా చేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు!?

తన చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి థియేటర్ల వారు సహకరించని కారణంగా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు వర్మ ప్రకటించాడు. తాజాగా తన ట్విట్టర్ లో ‘లెస్బియన్ నేపథ్యం కారణంగా చాలా థియేటర్లు సహకరించకపోవడంతో ‘ఖత్రా’ (డేంజరస్) చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని తెలియజేయడానికి చింతిస్తున్నాను’ అని వర్మ తెలిపాడు. అయితే… కోర్టు స్టే ఆర్డర్ కూడా వర్మ ప్లాన్ లో భాగం కాదు కదా! అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వర్మ ‘మా ఇష్టం’ (‘డేంజరస్) మూవీని రిలీజ్ చేసి ఉంటే… దాని ఆదరించేవారు ఎవరో, తిరస్కరించేవారు ఎవరో తెలిసిపోయి ఉండేది. కానీ యుద్ధభూమిలోకి దిగకుండానే వర్మ ఇలా అస్త్ర సన్యాసం చేశాడేమిటీ!? అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఎప్పటిలానే వర్మకంటూ ఏటీటీ ప్లాట్ ఫామ్ ఉంది కాబట్టి… టిక్కెట్ కొనుక్కుని అక్కడే ‘డేంజరస్’ను చూడమంటాడేమో చూడాలి!!

Exit mobile version