NTV Telugu Site icon

RGV: బన్నీకి ఆర్జీవీ విషెస్.. పవన్ ను అవమానించాడా.. ?

Varma

Varma

RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా.. ఏ ట్వీట్ వేసినా వివాదమే. నలుగురికి నచ్చనిది.. ఆర్జీవీ కి నచ్చదు అనే చెప్పాలి. ఇక రాజకీయాల్లో కూడా వర్మ జగన్ కు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ .. పవన్ ఫ్యాన్స్ చేత తిట్లు తింటూనే ఉన్నాడు. ఇక మొదటి నుంచి కూడా వర్మకు.. అల్లు అర్జున్ అంటే ఇష్టమని అందరికి తెల్సిందే. మెగా ఫ్యామిలీలో బన్నీనే మెగాస్టార్ అని కూడా చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక నిన్న అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడంతో.. వర్మ తనదైన రీతిలో బన్నీకి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఆ విషెస్ లో కూడా పవన్ ను, చరణ్ ను వదిలిపెట్టలేదు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

Telangana : అల్లం పేస్టు కొని వాడేస్తున్నారా? ఇది చూస్తే ఇక కొనరు…

” వన్ వే సక్సెస్ అంటే ఒక టాప్ హీరో తమ్ముడు లేదా కొడుకుగా వచ్చి అదృష్టవంతులు కావడం..సూపర్ సక్సెస్ అంటే కింది నుండి మొదలు పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవడం..మెగా సక్సెస్ అంటే హాస్యనటుడి మనవడు అనే బ్యాగేజీని కలిగి ఉండి కూడా బాక్సాఫీస్ మరియు అవార్డుల్లో కూడా సూపర్ హీరో అవడం.. కుడోస్ అల్లు అర్జున్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. బన్నీని విష్ చేయాలంటే చెయ్ కానీ.. తమ్ముడు, కొడుకు అంటూ పవన్, చరణ్ ను విమర్శిస్తే ఊరుకోము అని కొందరు అంటుండగా.. మరికొందరు.. అస్సలు ఆ మెగా ట్యాగ్ అనేది లేకుండా ఉంటే.. బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాడు కాదు అని చెప్పుకొస్తున్నారు.

Show comments