NTV Telugu Site icon

Renu Desai: మీరు ఒక తల్లికి పుట్టలేదా.. అకీరా నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్

Renu

Renu

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి సినిమా సమయంలో ప్రేమించుకొని.. లివింగ్ రిలేషన్ లో ఉండి ఒక బిడ్డకు జన్మనిచ్చికా పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డనే అకీరా నందన్. ఆ తరువాత ఈ జంటకు ఆద్య అనే అమ్మాయి పుట్టింది. ఇక కొన్ని విబేధాల కారణంగా ఈ జంట విడిపోయినా.. పిల్లలకు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రులానే ఉంటున్నారు. వారి చదువులు, కెరీర్ ను పవన్ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ఇక విడాకుల తరువాత పవన్ ను రేణు దేశాయ్ ఎంత విమర్శించిందో.. అంతే గౌరవిస్తూ వస్తుంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ వలన ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఒకానొక సమయంలో రేణు రెండో పెళ్లి చేసుకుంటుందని టాక్ నడిచింది. ఇక అప్పుడు అయితే రేణుపై పవన్ ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. ఆతరువాత ఆమె ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఇక అక్కడితో ఆ చాప్టర్ ముగిసిపోయింది. పవన్, రేణుకు విడాకులు ఇచ్చినా ఇంకా పవన్ ఫ్యాన్స్ ఆమెను వదినా అంటూనే సంబోధిస్తూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయితే ఈ ప్రేమ మీతిమీరినప్పుడు మాత్రమే రేణు స్పందిస్తుంది.

Crime News: ఛీఛీ.. కామాంధుడు.. కన్నకూతురినే గర్భవతిని చేసి..

ఇక నేడు అకీరా నందన్ 19 వ పుట్టినరోజు కావడంతో అభిమానులు విషెస్ చెప్తున్నారు. ఇక అందులో కూడా కొద్దిగా మితిమీరిన ప్రేమ చూపించినవారికి రేణు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. ” మ్యామ్ .. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి… మా అన్న కొడుకును చూడాలని ఉంటుంది మాకు. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు అయినా వీడియోస్ లో అకీరా బాబును చూపించండి” అంటూ ఒక వ్యక్తి కామెంట్ పెట్టగా.. దానిపై రేణు ఫైర్ అయ్యింది. ” మీ అన్న కొడుకు..??? అకీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా.???మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్ధం చేసుకోగలను.. కానీ, కొంచెం మాట్లాడే పద్దతి నేర్చుకోండి. నేను ఇలాంటి మెసేజ్ లను చాలా ఇగ్నోర్ చేస్తాను. కానీ, కొంతమంది అబ్బాయిలు.. హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . మరి ఈ పోస్ట్ పై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Show comments