Renu Desai Shares Akira Nandan Video and says Baby Warrior: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సినిమాలకు ఒకరకంగా దూరమైంది కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. వాస్తవానికి ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో నటిగా రి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆమె మళ్లీ మరో సినిమా ఏది ఒప్పుకోలేదు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఆమె వెల్లడిస్తూ ఉంటుంది. అంతేకాక తన పిల్లలు అకిరా నందన్, ఆద్యల ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె అకీరా నందన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Anupama: నేను నాగవంశీకి కాల్ చేస్తే రొమాంటిక్ సంభాషణలే ఉంటాయ్!
వాటిని ఒక్కసారిగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పోలికలతోనే కనిపిస్తున్నాడు అకీరా నందన్. ఇక అకీరా నందన్ ను తన బేబీ వారియర్ గా పేర్కొన్న రేణు దేశాయ్ తనకు నచ్చిన ప్రాంతంలో గడుపుతున్నాడని చెప్పుకొచ్చింది. ఇక ఫోటోలలో అఖీరా నందన్ ఒక పెద్ద శివలింగం ముందు కనిపిస్తూ ఉండడంతో పాటు ఒక పర్వతం మీద నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆమధ్య రాఘవేంద్రరావు మనవడితో కలిసి అకీరా నందన్ విదేశాలకు వెళ్లి ఒక ఫిలిమ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. దీంతో నటుడిగా ఆయన ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కానీ అకిరాకి నటన మీద ఆసక్తి లేదని మ్యూజిక్ మీద డైరెక్షన్ మీద ఆసక్తి ఉందని రేణు దేశాయ్ వెల్లడించింది. ఇక తాజా పోస్ట్తో మరోసారి పవన్ అభిమానులు అకిరా సినిమాల్లోకి నటించడానికి వస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.